ఎక్స్పో 2020 చివరి రోజున 24 గంటలూ నడవనున్న దుబాయ్ మెట్రో
- March 29, 2022
యూఏఈ: ఎక్స్పో 2020 ముగింపు నేపథ్యంలో దుబాయ్ మెట్రో 24 గంటలూ నడవనుంది. సందర్శకుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 31న అత్యధిక సంఖ్యలో సందర్శకులు వుంటారని అంచనా వేస్తున్నారు. ముగింపు కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దరిమిలా, సందర్శకులు ఎక్స్పో 2020ని వీక్షించేందుకు ముందస్తుగానే సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, ఆయా ప్రత్యేక కార్యక్రమాలకు సంబందించి సందర్శకుల్ని పరిమితం చేయనున్న దరిమిలా, ముందు వచ్చినవారికే ముందు అవకాశం దక్కనుంది. అయితే, ఎక్స్పో ప్రాంతంలో జెయింట్ స్క్రీన్లపై వాటిని చూడవచ్చు.సాయంత్రం నాలుగు గంటలకు జెట్స్ ఆకాశంలో రంగులద్దనున్నాయి. రాత్రి 7 గంటలకు అల్ వాసల్ ప్లాజా వద్ద 400 మంది ప్రదర్శన ఇవ్వనున్నారు. 8 గంటలకు యోయో మా నిర్వహించబడుతుంది దుబాయ్ మిలినీయం యాంఫీ థియేటర్ వద్ద. 8.30 నిమిషాలకు జూబ్లీ స్టేస్ వద్ద నోరా జోన్స్ ప్రదర్శన.. ఇంకా మరిన్ని ప్రత్యేక ప్రదర్శనలు వుండనున్నాయి.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







