టీఎస్ఆర్టీసీ ఉగాది ఆఫర్...
- March 31, 2022
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత… వినూత్న తరహాలో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాల బాట పట్టించే పనిలో పడిపోయారు సజ్జనార్..ఇక, ఏ పండుగ వచ్చినా..? ఏ ప్రత్యేక ఉన్నా..? ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు తీసుకున్నారు.. తాజాగా మరో ఆఫర్ తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ… ఉగాది పండుగ సందర్భంగా 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చింది.
అయితే, ఉగాది పండగ సందర్భంగా కేవలం ఏప్రిల్ 2వ తేదీన.. అంటే పండుగ రోజు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం సౌలభ్యం ఉంటుంది.. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు) కండక్టర్‌కు చూపించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొచ్చినట్టు వెల్లడించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఓపెన్ హౌస్ హైలెట్స్..!!
- అరబ్ లో అతి తక్కువ ప్రయాణ సమయం కలిగిన నగరాల్లో మస్కట్..!!
- 13,072 మంది ఉల్లంఘనదారులపై బహిష్కరణ వేటు..!!
- కేబుల్ రీల్స్ లో 3,037 ఆల్కహాల్ బాటిల్స్..!!
- యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!
- ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!