నిబంధనలను సవరించిన సౌదీ సెంట్రల్ బ్యాంక్
- April 13, 2022
సౌదీ: బ్యాంకు ఖాతాదారులను ఆర్థిక మోసాల నుండి రక్షించడానికి తాత్కాలిక ముందు జాగ్రత్త విధానాల నిబంధనలను నవీకరించినట్లు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ప్రకటించింది. గత కొన్ని రోజులుగా చేసిన అసెస్‌మెంట్‌లు, ఫాలో-అప్‌ల ఆధారంగా కొత్త విధానాలను తీసుకొచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కొత్త నిబంధనలు ఏప్రిల్ 7, 2022 నుంచి అమల్లోకి వచ్చాయని బ్యాంకులకు తెలియజేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. బ్యాంక్ క్లయింట్‌ల కోసం రోజువారీ బదిలీల కనీస పరిమితిని మునుపటి స్థాయికి పెంచారు. క్లయింట్ బ్యాంకులను సంప్రదించడం ద్వారా ఈ పరిమితిని తిరిగి తగ్గించుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఆన్‌లైన్‌లో బ్యాంక్ ఖాతాలను తెరవడానికి కూడా కొత్త నిబంధనలను తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..