94 మంది యాచకులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు

- April 21, 2022 , by Maagulf
94 మంది యాచకులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు

 

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ‘భిక్షాటన చేయడం నేరం’ అనే ప్రచారాన్ని షార్జా పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పవరకు 94 మంది యాచకులను షార్జా పోలీసులు అరెస్టు చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ ప్రచారాన్ని ప్రారంభించామని, చట్టం ప్రకారం భిక్షాటన శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని షార్జాలోని బెగ్గర్ కంట్రోల్ టీమ్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ జాసిమ్ మొహమ్మద్ బిన్ తలియా తెలిపారు. ఈ చట్టవిరుద్ధమైన పద్ధతులను అరికట్టడానికి షార్జా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. చాలా మంది బిచ్చగాళ్ళు వాణిజ్య, నివాస ప్రాంతాలు, మస్జీదుల సమీపం నుంచి అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో 65 మంది పురుషులు, 29 మంది మహిళలతో సహా 94 మంది యాచకులను అరెస్టు చేశామన్నారు. 80040, 901 ద్వారా యాచకుల సమాచారాన్ని తనిఖీ బృందాలకు తెలపాలని బిన్ తలియా తెలిపారు. అరెస్టయిన యాచకుల్లో ఎక్కువ మంది విజిట్ వీసాపై యూఏఈ వచ్చారని, మరికొందరు స్థానికులని,  డబ్బు సంపాదించడానికి పవిత్ర మాసాన్ని ఎంచుకున్నారని, పట్టుబడిన వెంటనే బిచ్చగాళ్లపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. అరెస్టయిన బిచ్చగాళ్ల వద్ద రెమిటెన్స్ రసీదులు దొరికాయని, ఒకతను 44,000 Dhs, మరొకతను Dhs 12,000, ఇంకోవ్యక్తి Dhs 9,000 కలిగి ఉన్నారని బిన్ తలియా తెలిపారు. ఈ ప్రచారం కొనసాగుతుందని,  2020, 2021లో 1,409 మంది యాచకులను అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి 500,000 దిర్హాలు స్వాధీనం చేసుకున్నామని బిన్ తలియా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com