భార‌త ప్ర‌భుత్వంపై జ‌పాన్ కీలక ఆరోప‌ణ‌లు

- April 21, 2022 , by Maagulf
భార‌త ప్ర‌భుత్వంపై జ‌పాన్ కీలక ఆరోప‌ణ‌లు

టోక్యో: భార‌త ప్ర‌భుత్వంపై జ‌పాన్ కీలక ఆరోప‌ణ‌లు చేసింది. ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌కు మాన‌వీయ కోణంలో తాము స‌హాయం చేయాల‌ని భావించామ‌ని, అయితే.. త‌మ విమానాన్ని భార‌త్‌లో ల్యాండ్ చేస్తామంటే భార‌త ప్ర‌భుత్వం అందుకు అంగీకారం తెల‌పలేద‌న్న‌ది జ‌పాన్ అభియోగం. ఈ రిపోర్టును నిక్కేయీ ఏసియా అన్న మీడియా హౌజ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని నిరాశ్ర‌యుల‌కు మాన‌వ‌తా కోణంలో తాము స‌హాయం అందించాల‌ని భావించామ‌ని, ఇందు కోసం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ విమానాన్ని భార‌త్‌లో ల్యాండ్ చేద్దామ‌ని భావిస్తే, భార‌త్ అందుకు నో చెప్పింద‌ని జ‌పాన్ అధికార పార్టీ లిబ‌ర‌ల్ డెమోక్రెటిక్ ఆరోపించింది. రిపోర్టుల ప్ర‌కారం భార‌త్‌లో లోడ్ చేసుకొని, దానిని పోలాండ్‌, రోమానియా ద్వారా ఉక్రెయిన్‌కు స‌ర‌ఫ‌రా చేయాల‌ని త‌ల‌పోసింది. అయితే దీనిపై భార‌త విదేశాంగ శాఖ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌న్న‌ది జ‌పాన్ ఆరోప‌ణ‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com