అక్రమ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ తో జాగ్రత్త: సౌదీ

- April 23, 2022 , by Maagulf
అక్రమ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ తో జాగ్రత్త: సౌదీ

జెడ్డా: లైసెన్స్ లేని విదేశీ మారకపు లావాదేవీలను ప్రోత్సహించే వ్యక్తులు లేదా సంస్థలతో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వాటిల్లో డబ్బును పెట్టి కోల్పోవద్దని సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ (MoC) సూచించింది. ఈ మేరకు అక్రమ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ (FOREX) ప్లాట్‌ఫామ్స్ లకు వ్యతిరేకంగా సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ (MoC) తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా పెట్టుబడిదారులను హెచ్చరించింది. అక్రమ విదేశీ మారకం లేదా క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి అక్రమ ప్లాట్‌ఫామ్స్ వివిధ పద్ధతులను అవలంభిస్తున్నాయని, అమాయక పెట్టుబడిదారులను ఆకర్షించి మోసం చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాంటి వాటిల్లో కస్టమర్ల నిధులను నిర్వహించడానికి, సురక్షితంగా ఉంచడానికి తగిన భరోసా లేకపోవడంతో మూలధనాన్ని కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. సౌదీ సెంట్రల్ బ్యాంక్, క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA), వాణిజ్య మంత్రిత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు లేని వాటిల్లో పెట్టుబడి పెట్టవద్దని సూచించింది. పెట్టుబడులు పెట్టేముందు వాటికి లైసెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలని, ఆ తర్వాతే అవగాహన పెంచుకొని పెట్టుబడులు పెట్టాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com