ప్రపంచంలోనే తొలి 'మెటా హ్యూమన్' క్యాబిన్ ఖతార్ లో ప్రారంభం
- April 24, 2022ఖతార్: ప్రపంచంలోనే మొట్టమొదటి 'మెటా హ్యూమన్' క్యాబిన్ ను ఖతార్ ఎయిర్ వేస్ ప్రారంభించింది. విమానయాన సంస్థ తన ప్రయాణికుల కోసం QVerse అనే నవల వర్చువల్ రియాలిటీ (VR)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖతార్ ఎయిర్వేస్ వెబ్ సైట్ ను సందర్శించే ప్రయాణికులు ఈ వీఆర్ టెక్నాలజీ ద్వారా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (HIA)లో ప్రీమియం చెక్-ఇన్ ప్రాంతాన్ని వర్చువల్‌గా సందర్శించవచ్చు. నావిగేట్ చేయడంతోపాటు ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్ ఇంటీరియర్ ను చూడవచ్చు. అలాగే అవార్డు గెలుచుకున్న బిజినెస్ క్లాస్ – Qsuite, ఎకానమీ క్లాస్ క్యాబిన్ లను స్వయంగా పరిశీలించవచ్చు. ఖతార్ జాతీయ క్యారియర్ డిజిటల్ ఇంటరాక్టివ్ కస్టమర్ అనుభవాన్ని అందించే 'మెటా హ్యూమన్' క్యాబిన్ సిబ్బందిని పరిచయం చేసిన మొదటి ప్రపంచ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్ వేస్ నిలిచింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..