శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా నటించిన ‘భళా తందనాన’ మే 6న విడుదల
- April 29, 2022
హైదరాబాద్: ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. చిత్ర యూనిట్ ఈ వారం జోరుగా ప్రమోషన్లను ప్లాన్ చేస్తుంది.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులుని ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది.
కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.
తారాగణం: శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు.
సాంకేతిక విభాగం:
దర్శకత్వం- చైతన్య దంతులూరి
నిర్మాత - రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
బ్యానర్: వారాహి చలనచిత్రం
సంగీతం - మణిశర్మ
ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్
డీవోపీ - సురేష్ రగుతు
స్టంట్స్: పీటర్ హెయిన్
ఆర్ట్ - గాంధీ నడికుడికార్
రచన - శ్రీకాంత్ విస్సా
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







