'తవక్కల్నా సర్వీసెస్' యాప్‌లో 140 కంటే ఎక్కువ సేవలు
- May 01, 2022
రియాద్: సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) 'తవక్కల్నా సర్వీసెస్' యాప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీని ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ఒకే చోట 140 కంటే ఎక్కువ సేవలను అందిస్తుంది. తవక్కల్నా సర్వీసెస్ అప్లికేషన్లో ప్రజలకు అవసరమైన, ప్రయోజనం చేకూర్చే అనేక సేవలు ఉన్నాయని పేర్కొంది. పాస్‌పోర్ట్ లు, వ్యక్తి గుర్తింపు, వ్యక్తిగత కార్డ్ లను కలిగి ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలచే ఆమోదించబడిన డిజిటల్ వాలెట్, డ్రైవింగ్ లైసెన్స్ లు, బీమా, డీడ్లు, ఏజెన్సీలను సమీక్షించడం, ఎహ్సాన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విరాళం అందించడం, సమాచార సవరణ, తవక్కల్నా కోడ్, మొబైల్ నంబర్‌ను ధృవీకరించడం లాంటి మరెన్నో సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తున్నారు. అదే సమయంలో “తవక్కల్నా” యాప్ కేవలం కోవిడ్-19 మహమ్మారి సేవలకు మాత్రమే పరిమితం చేయబడుతుందని పేర్కొంది. ఇందులో వ్యక్తుల ఆరోగ్య స్థితి, ఆరోగ్య పాస్‌పోర్ట్, కరోనావైరస్ PCR పరీక్షలు, వ్యాక్సిన్ సేవలు, ఆరోగ్య ప్రయాణ అవసరాలు ఉన్నాయి. అలాగే రవాణా కార్యకలాపాల సమయంలో అవసరమైన అనుమతుల నిర్వహణ కూడా ఈ యాప్ ద్వారా అందిస్తున్నారు. SDAIA పౌరులు, నివాసితులు, సందర్శకులు యాప్ ద్వారా అందించబడిన సేవల నుండి ప్రయోజనం పొందేందుకు యాప్ స్టోర్, గూగుల్ స్టోర్, యాప్ గ్యాలరీ, గెలక్సీస్టోర్ వంటి స్టోర్ల నుండి "తవక్కల్నా సర్వీసెస్" యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి సూచించారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







