రోడ్ సేఫ్టీ వీక్: పోస్టర్లతో బహుమతులు గెలుచుకునే అవకాశం
- May 04, 2022
కువైట్: మే 15 నుంచి 22 వరకు జరిగే రోడ్డు భద్రతా వారోత్సవం నేపథ్యంలో పోస్టర్ తయారీ పోటీల్ని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కువైట్లోని ఇండియన్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. ఇండియన్స్ ఇన్ కువైట్ డాట్ కామ్ అలాగే అల్ మైలెమ్ గ్రూప్ ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. పోటీలో విజేతలుగా నిలిచినవారికి 115 కువైటీ దినార్ల విలువైన బహుమతులు అందజేయడం జరుగుతుంది. మొదటి బహుమతి విజేతకు 50 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ లభిస్తుంది. రెండో బహుమతి విజేతకు 40 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తారు. మూడో బహుమతి విజేతకు 25 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడం జరుగుతుంది.అల్ మైలెమ్ గ్రూప్ ఈ బహుమతుల్ని అందించనుంది. రోడ్డు భద్రతపై పిల్లల్లో అవగాహన కల్పించడం ఈ పోటీల ఉద్దేశ్యం. మే 10లోపు ఫొటోలను పంపించాల్సి వుంటుంది. 15 మే నుంచి సోషల్ మీడియాలో ఎంపిక చేసిన పోస్టర్లు పోస్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







