అసిడిటీ,కడుపునొప్పిని తగ్గించుకోండి ఇలా
- June 11, 2015
ప్రస్తుత కాలంలో చాలా మంది ఛాతీలో మంట మరియు కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారు. ఇది పొట్టలో ఎక్కువ యాసిడ్స్ ఉన్నప్పుడు ఇలా జరగడం సహజం. పొట్టలో ఉన్న ఆహారం జీర్ణం అవ్వక పైకి నెట్టుతుంది. అజీర్ణం నోట్లోనే ఉన్నట్లు అనిపిస్తుంటుంది . ఇలాంటి పరిస్థితిని యాసిడ్ రిఫ్లెక్షన్ అని అంటారు. ఆహార వాహికలోని యాసిడ్స్ కారణంగా గొంతులోనూ మరియు ఛాతీలోనూ మంటగా అనిపిస్తుంది . దీన్ని హార్ట్ బర్న్ అంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇతర జీర్ణ సంబందిత సమస్యలు కూడా ఉంటాయి. అందుకోసం మీ వెంట ఎప్పుడూ యాంటాసిడ్ బాటిల్ ఉంటుంది. అదేవిధంగా యాంటాసిడ్ జెల్ ను తరచూ ఉపయోగించడం కూడా అంత ఆరోగ్యకరమైనది కాదు . ఎందుకంటే వీటి తరచూ ఉపయోగించడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఆహారాలు ఆల్కహాల్ స్వభావం కలిగి ఉండటం వల్ల స్టొమక్ యాసిడ్స్ కు దారితీస్తుంది మరియు దాంతో ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ కు దారితీస్తుంది. కాబట్టి, ఈ ఆహారాలు తీసుకుంటే హెల్తీ డైజెస్టివ్ ట్రాక్ మరియు అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల హార్ట్ బర్న్ మరియు ఎసిడిటిని నయం చేసుకోవచ్చు. మరి ఆ ఆహారాలేంటో ఒకసారి చూద్దాం... ఎసిడిటి, పొట్టనొప్పి మరియు యాసిడ్ రిఫ్లెక్షన్స్ నేచురల్ గా తగ్గించుకోవడానికి ప్రతి రోజూ ఉదయం బాదం పాలు త్రాగాలి. ఇది ఆల్కలైజర్ గా పనిచేస్తుంది మరియు మరియు పొట్టలోని ఎసిడిటిని న్యూట్రలైజ్ చేస్తుంది. బాదం పాలు ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టలో యాసిడ్స్ నుండి రక్షణ పొందడానికి ఒక లైనింగ్ లా ఏర్పడుతుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అయ్యే యాసిడ్ ఫార్మేషన్ ను ఓట్ మీల్ తగ్గిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ తీసుకోవడం వల్ల ఇది ఎసిడిటి మరియు మార్ట్ బర్న్ ను నివారిస్తుంది. అంతే కాదు ఓట్ మీల్లో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎసిడిటి వల్ల వచ్చే నొప్పి మరియు మంట నుండి ఉపశమనం కలిగించడంలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అంతే కాదు గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే నొప్పి మరియు ఇరిటేషన్ నుండి ఉపశమనం కలిగించడానికి పొట్టలో గ్యాస్ ను తగ్గిస్తుంది. ఇది పొట్టలో ఎసిడిటి తగ్గించడానికి ఇది ఒక బెస్ట్ ఫ్రూట్ మరియు ఇది హార్ట్ బర్న్ తగ్గిస్తుంది. మరియు ఇది స్టొమక్ అల్సర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఎనర్జీని కూడా అందిస్తుంది. ప్రతి రోజూ అరటిపండ్లు తినడం వల్ల హార్ట్ బర్న్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. హార్ట్ బర్న్ తగ్గించుకోవడానికి ఇది ఒక నేచురల్ మార్గం. ఫెన్నల్ (సోంపు)హార్ట్ బర్న్ నుండి తక్షణ ప్రభావం చూపుతాయి. అందుకోసం రెండు చెంచా సోంపు మరియు ఒక చెంచా తేనె గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చి తీసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత చల్లార్చి త్రాగాలి. ఇంకా కొన్ని సోంపు గింజలు నేరుగా తినడం వల్ల స్టొమక్ యాసిడ్స్ తగ్గిస్తుంది. ఎసిడిటి, యాసిడ్ రిఫ్లెక్షన్ మరియు హార్ట్ బర్న్ ని తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. మరియు ఇది రుచిలో తియ్యంగా ఉండటం వల్ల నమలుతున్నప్పుడు గాస్ట్రిక్ పెయిన్ మరియు ఎసిడిటి వల్ల వచ్చే ఇరిటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది . కలబంద రసంలో హీలింగ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి మరియు ఇది గ్యాస్ట్రోఇంటెన్షనల్ ట్రాక్ లో ఇన్ఫ్లమేషన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మరియు ఇది ఆల్కహాల్ స్వభావం కలిగి ఉండటం వల్ల స్టొమక్ లోని యాసిడ్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది . దాంతో హార్ట్ బర్న్ తగ్గించుకోవచ్చు.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







