నార్త్ ఎమిరేట్స్లో గ్యాస్ ధరల తగ్గింపు
- June 12, 2015
వంట గ్యాస్ ధరల్ని నార్త్ ఎమిరేట్స్‌లో తగ్గించారు. ఇప్పటివరకూ 31 దిర్హామ్స్‌గా ఉన్న సిలెండర్ ధరని 29 దిర్హామ్‌కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏడీఎన్‌ఓసీ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ హది మాట్లాడుతూ అంతర్జాతీయంగా చమురు ధరల ప్రభావంతో ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎడిఎన్‌ఓసీ సంస్థ షార్జా, అజ్మన్, ఉమ్ అల్ ఖైవైన్, రస్ అల్ ఖైమా మరియు ఫజారియాలలో సర్వీస్ స్టేషన్ల ద్వారా ప్రతిరోజూ 3 వేల కుకింగ్ గ్యాస్ సిలెండర్లను సరఫరా చేస్తోంది. రహల్ ఇ గ్యాస్ షార్జాలోని తమ అధికారులకు ఉచితంగా వంట గ్యాస్‌ని అందిస్తోంది. కార్డులు కల మిగతా వారు మాత్రం డబ్బులు చెల్లించి యూఏఏఈ వ్యాప్తంగా గ్యాస్ సిలెండర్స్‌ని పొందాల్సి ఉంటుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







