గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్ లో ట్యాంపరింగ్...కార్మికులు అరెస్ట్
- May 06, 2022
జెడ్డా: గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్‌లను ట్యాంపరింగ్ చేస్తున్న పలువురు ప్రవాస కార్మికులను అధికారులు అరెస్ట్ చేశారు. వారిపై దేశ బహిష్కరణ వేటు వేయాలని భద్రతా అధికారులకు రిఫర్ చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఇంధన మంత్రిత్వ శాఖ, సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ మరియు క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO) సంయుక్తంగా అనేక గ్యాస్ స్టేషన్లను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఓ గ్యాస్ స్టేషన్లో చట్టవిరుద్ధమైన పద్ధతులను అనుసరించినట్లు గుర్తించారు. కొంతమంది కార్మికులు గ్యాస్ పంప్ మీటర్ రీడింగ్‌లతో టింకరింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోల వైరల్ కావడంతో అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. వాణిజ్యం, ఇంధన మంత్రిత్వ శాఖలు, SASO సహకారంతో తూర్పు ప్రావిన్స్, జెడ్డా గవర్నరేట్‌లోని నిర్దిష్ట గ్యాస్ స్టేషన్లలో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







