'ఎఫ్ 3' ట్రైలర్ రిలీజ్..
- May 09, 2022
హైదరాబాద్: మామూలుగా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి 2019లో విడుదలయిన 'ఎఫ్ 2'. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ఆదరణ పొందింది. అందుకే దీనికి సీక్వెల్‌గా 'ఎఫ్ 3'ను తెరకెక్కించాడు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్.. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెంకటేశ్ కలిసి మల్టీ స్టారర్ చేయడం 'ఎఫ్ 2'కు ఎక్కడలేని హైప్ తీసుకొచ్చింది. దాంతో పాటు కామెడీ కూడా బాగా పండడంతో ఎఫ్ 2 సూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే అదే కాంబినేషన్‌తో 'ఎఫ్ 3'తో మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
తాజాగా విడుదలయిన 'ఎఫ్ 3' ట్రైలర్‌లో వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నవ్వులు పూయించారు. అంతే కాకుండా వెంకటేశ్‌కు ఈ సినిమాలో రేయి చీకటి ఉండడం.. వరుణ్ తేజ్‌కు నత్తి ఉండడం లాంటి అంశాలు మరింత ఫన్ క్రియేట్ చేసేలాగా ఉన్నాయి. క్యాస్టింగ్ విషయానికొస్తే.. ఎఫ్ 2లో ఉన్న నటీనటులే దాదాపు ఇందులో కూడా ఉన్నారు. అంతే కాకుండా ఇది మొత్తంగా మనీ చుట్టూ తిరిగే కథలాగా అనిపిస్తోంది. ఎఫ్ 3 సినిమా మే 27న విడుదల కానుంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







