మహారాష్ట్రలోని బారామతిలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్టేడియo..

- April 06, 2016 , by Maagulf
మహారాష్ట్రలోని బారామతిలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్టేడియo..

మహారాష్ట్రలోని బారామతిలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్టేడియాన్ని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, ముంబయి క్రికెట్‌ జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్‌ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌, ఎంపీ సుప్రియసూలే, మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగర్కర్‌, క్రికెటర్లు అజ్యింక రహానే, వసీమ్‌ జాఫర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ యువత క్రికెట్‌ రంగంలో వృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తంచేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు పవార్‌ చేస్తున్న కృషిని కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com