ముగ్గురు ఉగ్రవాదులను ఉరితీసిన సౌదీ
- May 15, 2022
రియాద్: ఉగ్రవాద ఆరోపణలపై దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులను సౌదీ అరేబియా ఉరితీసింది. ఇందులో ఇద్దరు సౌదీలు, ఒక యెమెన్ ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సౌదీ జాతీయుడైన మహమ్మద్ బిఎన్ ఖిదిర్ బిన్ హషీమ్ అల్-అవామీ ఉగ్రవాద టీంలో చేరి, భద్రతకు విఘాతం కలిగించడం, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్-అవామీ తన ఇంట్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను దాచడం, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి ఆర్పీజీలు, మోలోటోవ్ కాక్టెయిల్లు, పరికరాలను కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. మరో సౌదీ జాతీయుడు హుస్సేన్ బిఎన్ అలీ అల్ బు-అబ్దుల్లా కూడా ఉగ్రవాదులతో కలిసి పనిచేసినందుకు, భద్రతా దళాల సభ్యుడిని కాల్చి చంపినందుకు, రాజ్యంలో భద్రతకు భంగం కలిగించడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించి దాచడం వంటి చేయడంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చినందుకు దోషిగా తేలాడని తెలిపింది. యెమెన్ జాతీయుడైన మహమ్మద్ అబ్దుల్బాసేట్ అల్-ముల్లామి ఇరాన్-మద్దతుగల హౌతీ మిలీషియాలో చేరి, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి చట్టవిరుద్ధంగా రాజ్యంలోకి ప్రవేశించినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రిమినల్ కోర్ట్ ముగ్గురికీ మరణశిక్ష విధించింది. ఈ తీర్పును అప్పీల్ కోర్టు, సుప్రీంకోర్టు ఆమోదించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







