షేక్ ఖలీఫా కు నివాళులు అర్పించిన భారత ఉపరాష్ట్రపతి

- May 15, 2022 , by Maagulf
షేక్ ఖలీఫా కు నివాళులు అర్పించిన భారత ఉపరాష్ట్రపతి

నూతన అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ తో భేటీ అయిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

అబుధాబి: యూఏఈ దివంగత అధ్యక్షునికి భారత ప్రభుత్వం తరపున నేడు అబుధాబిలో నివాళులు అర్పించారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

యూఏఈ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ను అబుధాబిలోని ముష్రిఫ్ ప్యాలెస్లో కలిసి సంతాపం తెలియజేయడంతోపాటు పదవి చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ "భారత్-యూఏఈ మధ్య సత్సంబంధాలకు మరియు యూఏఈ లో నివసిస్తున్న భారతీయుల క్షేమానికి షేక్ ఖలీఫా చూపిన చొరవ మరువరానిది.భారత్ కు యూఏఈ ఎంతో సన్నిహిత మిత్రుడు" అని ఖలీఫా తో ఆయనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు.

షేక్ మొహమ్మద్ నేతృత్వంలో భారత్-యూఏఈ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసారు భారత్ ఉపరాష్ట్రపతి.

ఉపరాష్ట్రపతి తోపాటు యూఏఈ భారత రాయబారి సంజయ్ సుధీర్, ఉపరాష్ట్రపతి సెక్రటరీ డా.ఐ.వి సుబ్బా రావు, జాయింట్ సెక్రటరీ (గల్ఫ్) విపుల్ మరియు ఇతర భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉన్నారు.

ఇక, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com