ఎన్టీయార్ 30: నో డౌట్ కొరటాలకు అగ్నిపరీక్షే!

- May 17, 2022 , by Maagulf
ఎన్టీయార్ 30: నో డౌట్ కొరటాలకు అగ్నిపరీక్షే!

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీయార్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ లిస్టులో చేరిపోయాడు. సో, ఆయన తదుపరి చేయబోయే సినిమా ఆ రేంజ్‌లోనే వుండాలి. ఫ్యాన్స్ అంచనాలు ఆ లెవల్‌లోనే వుంటాయ్ మరి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ చేయబోతున్న సినిమా కొరటాల శివ డైరెక్షన్‌లో అన్న సంగతి తెలిసిందే.

‘ఆచార్య’ సినిమాతో భారీ డిజాస్టర్ ఇచ్చిన కొరటాల శివ, ఎన్టీయార్ సినిమాని చాలా సీరియస్‌గా తీసుకున్నాడట. ఇంతవరకూ ఫెయిల్యూర్ అంటూ ఎరుగని కొరటాల శివకు ‘ఆచార్య’ బిగ్ షాక్ ఇచ్చింది. తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాలంటే, అర్జెంటుగా హిట్ ఇవ్వాల్సిందే.

సో, ‘ఆచార్య’ షాక్ నుంచి వెంటనే తేరుకుని, ఎన్టీయార్ ప్రాజెక్టుపై గట్టిగా ఫోకస్ పెట్టాడట కొరటాల శివ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా సిద్ధం చేసేశాడట. ఈ నెల 20న ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఓ సర్‌ప్రైజ్ కూడా ప్లాన్ చేశాడట.

ఫ్యాన్స్ అస్సలు ఊహించని రేంజ్‌లో ఆ సర్‌ప్రైజ్ వుండబోతోందనీ తెలుస్తోంది. సామాజిక అంశాలకు కమర్షియల్ టచ్ ఇస్తూ, కథని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సిద్ధ హస్తుడు కొరటాల శివ. ‘ఆచార్య’ విషయంలో ఎందుకో కొరటాల ప్లాన్ రివర్స్ అయ్యింది. కానీ, ఎన్టీయార్ విషయంలో తప్పుటడుగులు వేయనంటున్నాడు కొరటాల శివ.

ఇక, ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, పొలిటికల్ టచ్‌తో ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. అది కూడా యూనివర్సల్ పొలిటికల్ ఫ్లేవర్ అద్దబోతున్నాడట. సో, ఎన్టీయార్ 30, ప్యాన్ ఇండియా టార్గెట్ అందుకోవడం పక్కా.. అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com