జ్యోతిలక్ష్మీ:రివ్యూ

- June 12, 2015 , by Maagulf
జ్యోతిలక్ష్మీ:రివ్యూ

కథ  

సత్య(సత్యదేవ్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్, వేశ్య దగ్గరకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు స్నేహితుడి సహాయంతో నగరం మొత్తం వెతికినా అతనికి కావలసిన అమ్మాయి దొరకదు కాగా అతను ఒక ప్రత్యేక అమ్మాయి కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది, అమ్మాయే "జ్యోతిలక్ష్మి(చార్మీ)" . ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాను అని పెళ్లి చేసుకుంటాను అని ఆమెతో అంటాడు, ముందు ఒప్పుకోకపోయినా మెల్లగా అతన్ని అర్ధం చేసుకుంటుంది జ్యోతిలక్ష్మి ఒక రోజు ఆమె కంపెనీ నుండి పారిపోతుంది. సత్య మరియు లక్ష్మి పెళ్లి  చేసుకుంటారు విషయం తెలిసిన నారాయణ్ పట్వాడి సత్య మీద దాడి చేయించి జ్యోతిలక్ష్మిని తిరిగి తన దగ్గరకి తెచ్చుకోవాలని అనుకుంటాడు. విషయం తెలిసిన జ్యోతిలక్ష్మి ఎలాగయినా నారాయణ పట్వాడి సెక్స్ రాకెట్ ని తెరదించాలని నిర్ణయించుకుంటుంది దానికి సత్య కూడా సపోర్ట్ చేస్తాడు.. తరువాత ఏమయింది అనేది తెర మీద చూడాల్సిందే... 

 

 

 

 

నటీనటుల ప్రతిభ

చార్మీ బాగా నటించింది , ఇప్పటివరకు ఆమె బెస్ట్ అని చిత్రాన్ని అనుకున్నా దాని తరువాత స్థానంలో ఈ చిత్రాన్ని ఉంచవచ్చు అంతలా ఆకట్టుకుంది ముఖ్యంగా ఒక వేశ్య పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంది, సహజాత్మక నటన కనబరిచింది. సత్య దేవ్ కూడా శైలిలో నటించి ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్ విలన్ పాత్రలో చాలా బాగా నటించారు. విలనిజం ని అద్భుతంగా పండించాడు. బ్రహ్మానందం పాత్రకి ఒక కారణం లేకుండాపోయింది, నవ్విస్తున్నాడా లేక మరేదయినా చేస్తున్నాడా క్లారిటీ ప్రేక్షకుడికి ఎలాగు లేదు పూరి జగన్నాథ్ కి అయినా ఉంటె బాగుండేది. టార్జాన్ మరియు ప్రియదర్శిని రామ్ లు ఉన్నంతలో ఆకట్టుకున్నారు. ధనరాజ్ , సంపూర్నేష్ , ఉత్తేజ్ , నెల్లూరు గిరి తలుక్కుమని మాయమయ్యారు... 

సాంకేతికవర్గం పనితీరు

 కథ, కథనం , మాటలు , దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలని తన మీద వేసుకున్నారు పూరి జగన్నాథ్ , కథ విషయానికి వస్తే పలుమార్లు చూసిన కథ అయినా పూరి మాటల్లో కాస్త కొత్తగానే కనిపించింది. కథనంలో వేగం ఉంచడానికి మొదటి అర్ధ భాగం అంతా అందాన్ని నమ్ముకోడంతో బానే గడిచిపోయింది అసలు కథ రెండవ అర్ధ భాగంలో మొదలయ్యింది కథ, కాని సరయిన సమయంలో పండాల్సిన సెంటిమెంట్ ని కాస్త ఆలస్యం చెయ్యడంతో ప్రేక్షకుడిని  చెయ్యలేకపోయారు. ఒక సహజ సమస్యకి వాణిజ్య అంశాలను అద్దడం లో పూరి సఫలం అయ్యాడు.. కాని ఒక పాత్ర మీద జాలి కలగకపోతే ఆ పాత్ర ఎంతలా తిరగబడినా ప్రేక్షకుడికి అర్ధం అవ్వదు ఆ పాయింట్ ని పూరి జగన్నాథ్ ఎలా అయ్యారో మరి .. అయన  శైలిలో రాసుకున్న డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టేకింగ్ కూడా చాలా బాగుంది. పీజీవిందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం అందించిన సునీల్ కశ్యప్ పాటలు పరవాలేదు అనిపించినా, నేపధ్య సంగీతం చాలా బాగుంది. శేఖర్ అందించిన ఎడిటింగ్ ఇంకా క్రిస్పీగా ఉండాల్సింది, చిత్ర నిడివి ఇంకాస్త తగ్గించి ఉంటె బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చిత్ర విశ్లేషణ

సమాజంలో  సున్నితమయిన అంశాన్ని ఇప్పటి వరకు అందరు సున్నితమయిన విధానంలో సహజాత్మకంగా చెప్పారు మొదటి వాణిజ్య అంశాలను కలిపి ప్రయత్నించాడు పూరి జగన్నాథ్. కొంతవరకు విజయం సాదించినా చాలా వరకు చిత్రం దారి తప్పింది అని చెప్పుకోవాలి. మగాడు ఫెయిల్ అయితేనే ఆడదానికి ఇలాంటి వస్తుంది, అలాంటి మగాడే వీళ్ళని చులకన చేసి మాట్లాడుతాడు. ఇదే పాయింట్ మీద చిత్రాన్ని నడిపారు పూరి జగన్నాథ్ , ఒక మగడు సరిగ్గా సపోర్ట్ చేస్తే ఆడది ఏదయినా సాదిస్తుంది అనే విషయాన్నీ అంతర్లీనంగా చూపించారు. ఇందులో పూరి జగన్నాథ్ అన్నట్టు ఆడదాన్ని అర్ధం చేసుకోకపోయినా పర్లేదు కాని గౌరవిస్తే చాలు , ఒక అమ్మాయి పడే బాధను చెప్పారు కాని చూపించలేకపోయారు పూరి జగన్నాథ్. మీరు స్త్రీవాదులు అయితే మీకు ఈ చిత్రం నచ్చుతుంది. కాకపోతే చిత్రం ఆసాంతం క్లాస్ పీకినట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ విభాగానికి చెందుతారో లేదో అనేది నిర్ణయించుకొని వెళ్ళండి .

 

స్టార్ కాస్ట్:చార్మి కౌర్ 
ప్రొడ్యూసర్:చార్మి కౌర్,స్వేతలన,వరుణ్ తేజ ,సి.వి.రావు,సి.కళ్యాణ్
డైరెక్టర్:పూరి జగన్నాధ్ 
మ్యూజిక్:సునీల్ కశ్యప్ 

 

--మాగల్ఫ్.కాం రేటింగ్‌: 3/5

 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com