పెళ్లంటే ఫైర్ అవుతోన్న మహేష్ హీరోయిన్.. అసలేమైంది.?
- May 23, 2022
‘పెళ్లి చేసుకుంటేనే లైఫ్‌లో సెటిలైనట్టా.? పెళ్లి చేసుకోకపోతే సెటిల్ అయినట్లు కాదా.?’ అని క్వశ్చన్ చేస్తోంది అందాల భామ కియారా అద్వానీ. ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్‌తో ద్వితీయ విఘ్నం అందుకుని టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసింది.
ఇక్కడి అన్ లక్, బాలీవుడ్లో లక్కుగా మారి, అక్కడ అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు శంకర్ - రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్‌కి వస్తుందనుకోండి కియారా.
అసలు విషయానికి వస్తే, చేతి నిండా ఫుల్ ప్రాజెక్టులతో బిజీగా వున్న కియారా అద్వానీకి ఇప్పుడు ‘పెళ్లి’ అనే మాటతో పెద్ద చిక్కే వచ్చి పడింది. రీసెంటుగా ‘భూల్ భూలయ్యా 2’ సినిమాతో ధియేటర్ల్లో సందడి చేస్తోంది కియారా అద్వానీ. లాంగ్ బ్యాక్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్‌కి కాసుల పంట పండిస్తున్న సినిమాగా ఈ సినిమా టాక్‌లో నిలిచింది.
ఓ పక్క ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే, మరో పక్క ‘జిగ్ జిగ్ జియో’ అను మరో సినిమా ప్రమోషన్లలోనూ షుషారుగా పాల్గొంటోంది కియారా. అయితే, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కియారా పెళ్లి ముచ్చటతో మీడియా లొల్లి లొల్లి చేస్తోందట.
ఆ సందర్భంగానే కాస్త ఫైర్ అయ్యింది కియారా అద్వానీ. తన పెళ్లి విషయంలో మీడియాకి ఎందుకంత అత్యుత్సాహం అనుకుందో ఏమో గట్టిగా వాతలు పెట్టేసింది మీడియాకి అందాల భామ కియారా అద్వానీ.
అయినా పెళ్లనేది ప్రస్తుతం హీరోయిన్ల విషయంలో చాలా సింపుల్ ఇష్యూ. అది కెరీర్‌కి ఎంత మాత్రమూ అడ్డంకి కావడం లేదు. చాలా మంది హీరోయిన్ల విషయంలో అది ప్రూవ్ అయ్యింది. అవుతూనే వుంది కూడా. సో, కియారా విషయంలోనూ అలాగే జరిగినా జరగొచ్చు. పూర్తిగా అది ఆమె పర్సనల్ అంతే.!
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







