ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభం
- May 27, 2022
అమరావతి: నేడు ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభమయ్యింది. టీడీపీ పండుగలా నిర్వహించే మహానాడుకు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. సభావేదికపై పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఆశీనులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించి, ప్రసంగాలను, చర్చలను ప్రారంభిస్తారు.
మరోవైపు, పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టీడీపీ 40 వసంతాలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యుగపురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు మహానాడు వేదికపైనే అని తెలిపారు. తాను తెలుగువాడిని, తెలుగుదేశం వాడిని, మహానాడులో పాల్గొనడం తమకు దక్కిన అదృష్టమని అన్నారు. తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా.. ఇదే నా ఆహ్వానం అని అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







