హజ్ 2022.. ప్రవాసులకు మక్కా ప్రవేశం నిషేధం
- May 27, 2022
మక్కా: అనుమతులు లేని ప్రవాసులకు మక్కా ప్రవేశ నిషేధం గురువారం నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది హజ్ యాత్రను క్రమబద్ధీకరించడానికి సంబంధించిన సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ప్రతినిధి జనరల్ సమీ అల్-షువైరెఖ్ తెలిపారు. మక్కా ప్రవేశానికి అనుమతి పొందిన ప్రవాసులు మాత్రమే మే 26కి సంబంధించిన షవ్వాల్ 25 గురువారం నుండి పవిత్ర నగరంలోకి అనుమతించబడతారని పేర్కొన్నారు. అనుమతులు ఉన్నవారు మక్కా ప్రవేశ కేంద్రాల వద్ద ఉన్న భద్రతా నియంత్రణ కేంద్రాల నుండి అనుమతులు పొందవచ్చని తెలిపారు. అవసరమైన పత్రాలు లేని అన్ని వాహనాలు, నివాసితులను వెనక్కి తిప్పిపంపుతామన్నారు. పవిత్ర ప్రదేశాలలో పని చేయడానికి ఎంట్రీ పర్మిట్, మక్కా నుండి జారీ చేయబడిన రెసిడెన్సీ పర్మిట్ (ఇఖామా), ఉమ్రా పర్మిట్ ఉన్నవారికి మాత్రమే మక్కాలోకి అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







