ప్రగతి ఆంటీకి సంతృప్తినిచ్చిందేంటో తెలుసా.?

- May 31, 2022 , by Maagulf
ప్రగతి ఆంటీకి సంతృప్తినిచ్చిందేంటో తెలుసా.?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన ప్రతిభ చాటుకుంటోన్న నటి ప్రగతి. గ్లామరస్ మదర్‌గా, స్టైలిష్ అత్తగా.. వదినగా, ఇలా పలు రకాల పాత్రల్లో ప్రగతి తనదైన ముద్ర వేసింది వెండితెరపై. నిజానికి ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కాదు, హీరోయిన్‌గానే వెండితెరకు పరిచయమైంది.

తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన ప్రగతి, తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నటిగా సక్సెస్‌ఫుల్ కెరీర్‌ని కొనసాగిస్తోన్న ప్రగతి, ఈ మధ్య సోషల్ మీడియాలో కుర్రకారుకు హాట్ ఫేవరేట్‌గా మారింది.

రకరకాల ఫిట్‌నెస్ వర్కవుట్లూ, డాన్సలూ చేస్తూ, ఇన్‌స్టాలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకుంది. ప్రగతి ఆంటీ డాన్సులకూ, వర్కవుట్ వీడియోలకూ కుర్రోళ్లు ఎక్కడెక్కడో కోసేసుకుంటుంటారు మరి. ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రగతి ఆంటీ.

ఇంత చేసినా ప్రగతికి సంత‌ప్తి అనేది లేదట. లేటెస్టుగా ‘ఎఫ్ 3’ సినిమాలో ప్రగతి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ రెండింట్లోనూ ప్రగతి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. హీరోయిన్లకు తల్లిగా మంచి టైమింగ్‌లో కామెడీ పండించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

ఈ సినిమా ప్రమోషన్లలోనూ ప్రగతి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. సినిమా సూపర్ హిట్ అవ్వడం ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చిందంటోంది. ఇంతవరకూ చేసిన పాత్రలన్నీ ఒకెత్తు. ‘ఎఫ్ 2’,‘ఎఫ్ 3’ సినిమాల్లో తన పాత్ర ఇంకో ఎత్తు. ఆ పాత్రలు తనకెంతో సంత‌ృప్తినిచ్చాయనీ, కెరీర్ బెస్ట్ రోల్స్‌గా అభివర్ణించుకుంటోంది ప్రగతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com