శ్రీవారి భక్తులకు అలర్ట్..

- May 31, 2022 , by Maagulf
శ్రీవారి భక్తులకు అలర్ట్..

తిరుమల: తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ ముఖ్య గ‌మ‌నిక‌ విడుద‌ల చేసింది. తిరుమ‌ల‌పైకి ఎలాంటి ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. తిరుమ‌ల కొండ‌పై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్న‌ట్లు టీటీడీ ప్ర‌క‌టించింది.సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం బుధ‌వారం (జూన్ 1) నుంచే అమ‌ల్లోకి రానున్న‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.

తిరుమ‌ల కొండ‌పై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్ర‌క‌టించిన టీటీడీ… కొండ‌పైకి ఎలాంటి ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను అనుమతించ‌ని విధంగా నిఘా పెట్ట‌నున్న‌ట్లు తెలిపింది. ఇందుకోసం అలిపిరి టోల్‌గేట్ దగ్గరే తనిఖీలు చేయనున్నారు. అలిపిరి టోల్ గేట్ దగ్గర ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్ల‌తో నిఘా పెంచ‌నున్న‌ట్లు టీటీడీ వెల్లడించింది. ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతిస్తామన్నారు. అలాగే కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్‌కు ప్ర‌త్యామ్నాయాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.

ఇప్పటికే ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్లు నిషేధించిన టీటీడీ.. రేపటి నుంచి పూర్తి స్తాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనుంది. చివరకు ఆట వస్తువులపై వచ్చే ప్లాస్టిక్ కవర్లపైనా బ్యాన్ విధించారు. షాంపూ ప్యాకెట్లు కూడా అనుమతించారు. కొండపై ఉన్న హోటళ్లు, దుకాణదారులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమావేశం అయ్యారు.జూన్ 1 నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నామని.. దుకాణదారులు, హోటళ్లు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామన్నారు. చివరికి షాంపూ ప్యాకెట్లు కూడా అమ్మకూడదని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ నిషేధానికి భక్తులు, దుకాణదారులు సహకరించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com