BAPS ప్రతినిధి బృందంతో సమావేశమైన ప్రిన్స్ సల్మాన్
- June 01, 2022
బహ్రెయిన్: స్వామి బ్రహ్మవిహారిదాస్, BAPS స్వామినారాయణ సంస్థ, గ్లోబల్ స్పిరిచువల్ హిందూ మూవ్ మెంట్ ప్రతినిధి బృందంతో క్రౌన్ ప్రిన్స్, బహ్రెయిన్ ప్రధాన మంత్రి, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న నిర్మాణం ప్రారంభించిన BAPS స్వామినారాయణ్ హిందూ దేవాలయం నిర్మాణం గురించి ఈ సమావేశంలో చర్చించారు. భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అంతర్జాతీయ సమన్వయకర్త, BAPS మిడిల్ ఈస్ట్ అధిపతి స్వామి బ్రహ్మవిహారిదాస్, స్వామిఅక్షరాతిత్ దాస్, BAPS బహ్రెయిన్ ప్రెసిడెంట్ డా.ప్రఫుల్ వైద్య, కమ్యూనిటీ లీడర్లు రమేష్ పాటిదార్, అహెశ్ దేవ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మవిహారిదాస్ ఈ చారిత్రక ఘట్టాన్ని స్వాగతిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పంపిన ఒక సందేశాన్ని ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ కు అందించారు.బహ్రెయిన్ దేవాలయం అన్ని మతాలకు చెందిన వ్యక్తులను స్వాగతిస్తుందని, వారు వివిధ సంస్కృతి, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం భారతీయ సంప్రదాయాలను తెలుసుకోవచ్చని స్వామి బ్రహ్మవిహారిదాస్ అన్నారు. స్వామినారాయణ ఆలయ నిర్మాణం భారతదేశం, బహ్రెయిన్ మధ్య సంబంధాలు, అంతర్జాతీయ హార్మోనియసాహోల్కు చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందన్నారు.



తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







