BAPS ప్రతినిధి బృందంతో సమావేశమైన ప్రిన్స్ సల్మాన్

- June 01, 2022 , by Maagulf
BAPS ప్రతినిధి బృందంతో సమావేశమైన ప్రిన్స్ సల్మాన్

బహ్రెయిన్: స్వామి బ్రహ్మవిహారిదాస్, BAPS స్వామినారాయణ సంస్థ, గ్లోబల్ స్పిరిచువల్ హిందూ మూవ్ మెంట్ ప్రతినిధి బృందంతో క్రౌన్ ప్రిన్స్, బహ్రెయిన్ ప్రధాన మంత్రి, ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న నిర్మాణం ప్రారంభించిన BAPS స్వామినారాయణ్ హిందూ దేవాలయం నిర్మాణం గురించి ఈ సమావేశంలో చర్చించారు. భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అంతర్జాతీయ సమన్వయకర్త, BAPS మిడిల్ ఈస్ట్ అధిపతి స్వామి బ్రహ్మవిహారిదాస్, స్వామిఅక్షరాతిత్ దాస్, BAPS బహ్రెయిన్ ప్రెసిడెంట్ డా.ప్రఫుల్ వైద్య, కమ్యూనిటీ లీడర్లు రమేష్ పాటిదార్, అహెశ్ దేవ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మవిహారిదాస్ ఈ చారిత్రక ఘట్టాన్ని స్వాగతిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పంపిన ఒక సందేశాన్ని ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ కు అందించారు.బహ్రెయిన్ దేవాలయం అన్ని మతాలకు చెందిన వ్యక్తులను స్వాగతిస్తుందని, వారు వివిధ సంస్కృతి, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం భారతీయ సంప్రదాయాలను తెలుసుకోవచ్చని స్వామి బ్రహ్మవిహారిదాస్ అన్నారు. స్వామినారాయణ ఆలయ నిర్మాణం భారతదేశం, బహ్రెయిన్ మధ్య సంబంధాలు, అంతర్జాతీయ హార్మోనియసాహోల్‌కు చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com