బాలయ్య 100వ సినిమా ప్రకటన
- April 08, 2016
అంతర్జాతీయ చలన చిత్రనటుడు దివంగత నందమూరితారక రామారావు కుమార్డు నందమూరి బాలకృష్ణ ఉగాది పర్వదినాన తన 100వ సినిమా పేరు "గౌతమీ పుత్ర శాతకర్ణికుడుగా ప్రకటించారు.శుక్రవారం ఉదయం పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలోని ధ్యానబుద్ధ ప్రారగణంలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్ కార్యక్రమంలో నటుడు బాలకృష్ణ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఉగాది మహా పర్వదినంనాడు చరిత్రకల్గిన ప్రదేశంలో తొలి తెలుగు రాజు చిత్రం తయారుఅని ఇది తన తండ్రి నందమూరి తారక రామారావు ప్రేరణతో చేస్తున్నానని ఈ చిత్రం నా99చిత్రాల కృషి ఫలితం అని 99మైలురాళ్ళుదాటి 40 వసంతాల వయస్సులో 'గౌతమీ పుత్ర శాతకర్ణికుడు గా పాత్రని పోషించి అందరిమనస్సులు మెచ్చెలా నటిస్తానని తెలిపారు.మనదేశ యువతతోపాటుగా విదేశీయులు మన ఈ చిత్రం చూచి గర్విస్తారని తెలిపారు.మన సాంప్రదాయాలు భక్తిభావం పెంపొందాలిని కోరారు.క్రీ.పూ.73లోనే తొలి తెలుగు రాజుల పాలన మొదలైందని ఆనాడు శాతకర్ణికుడు 18సంవత్సరాల వయస్సులో 1లక్ష మంది సైనికులతో 12వేల ఎనుగులతోను 23వేల గుర్రములతో సైన్యం ఏర్పాటుచేసి భారతదేశాన్ని చిన్నచిన్న రాజ్యాలు మొదలు అన్ని రాజ్యాలను జయించి ఆంధ్రుల తొలి రాజధాని నేటి ఈ అమరావతి అని ఆనాటి ధాన్యకటకంగా నిర్మించారని మూడు ప్రాంతాలనుండి దేశాన్ని పరిపాలించారని చెప్పారు.ఈనాడు ఉగాది అనేపదం ఆనాటి నుండే వచ్చిందని షడ్రుచుల సమ్మేళనం ఉగాది అని చెప్పారు. భారతదేశంలో తెలుగు మాట్లాడేవారు రెండవస్థానంలో ఉన్నారని మన తెలుగుభాషను మన సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవించి ఆచరించాలని విదేశాల్లోని మన భారతీయులు మన ఆచారాన్ని ఆచరిస్తున్నారని చెప్పారు. కులం మతం ప్రాంతభేదం లేదని తన వసుదైక కుటుంబీకుడినని తన 100వ చిత్రం అందరికీ సంతోషం కల్గేలా ఉంటుందని చెప్పారు.విలేకరుల సమావేశంలో ఇంకా సినిమా డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ తెలుగు తొలి రాజు చరిత్రతో ఈ సినిమా అవ్వడం గర్వంగా ఉందని బాలకృష్ణతో ఈ సినిమా చెయ్యడం చాలా ఆనందమని చెప్పారు.అభిమనాలు ప్రెస్‌మీట్‌లోకి తమ అభిమాన హీరోతో ఫోటోలకు ఎగబడ్డారు.కార్యక్రమానికి తొలుత పెదకూరపాడు ఎమ్మెల్యే బాలకృష్ణను స్వాగతించారు. తొలుత పాఠశాల వద్దగల గౌతమీపుత్ర శాతకర్ణి 23వ రాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.తదుపరి విలేకర్ల సమావేశం నిర్వహించారు.అభిమానులు చిత్రయూనిట్ బృందం పంగలూరి శ్రీనివాస్,కొమ్మినేని వెంకటేశ్వరరావు,నిర్మాత సాయిబాబు,రాజీవ్‌రెడ్డి, డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్‌లు పాల్గొనగా మల్లాది విష్ణు బృందం అన్నం శ్రీనివాసరావు,అర్తిమళ్ళ శ్రీనివాసరావు మరియు అమరావతి సిఐ మేదరమెట్ల హనుమంతరావు,పెద్దఎత్తున పాత్రికేయులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









