భారతీయుల అప్లికేషన్లే అధికం వాషింగ్టన్

- April 08, 2016 , by Maagulf
భారతీయుల అప్లికేషన్లే అధికం వాషింగ్టన్

హెచ్-1బీ వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రస్తుత సంవత్సరంలో జారీ చేయనున్న 65 వేల వీసాల కోసం 2.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) తెలిపింది. అంటే జారీ చేయాలనుకున్న వీసాల కంటే నాలుగు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి.అమెరికాలో పనిచేయడానికి అత్యధిక నైపుణ్యం కలిగిన కార్మికులకోసం హెచ్-1బీ వీసాలను అక్కడి ప్రభుత్వం ప్రతియేటా జారీ చేస్తుంది. అమెరికాలో ఎస్‌టీఈఎం(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్యమేటిక్స్)లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వీసా అందించనున్నది. ఏప్రిల్ 1నాటికి వీసాకోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతానికి దరఖాస్తులను స్వీకరించిన యూఎస్‌సీఐఎస్.. యాదృచ్చిక ఎంపిక ప్రక్రియ తేదిని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. గతేడాది 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com