అయ్యో పాపం.! సమంతకే ఎందుకిలా జరుగుతోంది.?
- June 07, 2022
సమంత మంచి నటి. అందులో నో డౌట్. అందుకేనేమో సౌత్ ఇండస్ర్టీ మొత్తం ఆమెను నెత్తిన పెట్టుకుంది.పెళ్లయితే చాలు హీరోయిన్ల కెరీర్ అటకెక్కిపోయినట్లే.. అనే ప్రచారానికి చరమగీతం పాడేసింది సమంత. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్గా మంచి అవకాశాలు దక్కించుకుంటోంది.
అంతకు మించిన సక్సెస్‌తో నటిగా దూసుకెళ్లిపోతోంది. ఈ మధ్య నాగ చైతన్యతో సమంత విడాకులు ఓ పెద్ద ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూతో సమంత కెరీర్‌కి కాస్త డ్యామేజ్ కలుగుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఆ ఇష్యూ కూడా సమంతకు మంచే చేసినట్లుంది.
ఆ తర్వాత బాలీవుడ్లో సమంతకు బాగా క్రేజ్ పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి బోలెడన్ని క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లయిన అనుష్క శర్మ తదితరులు సమంతను తెగ పొగిడేస్తున్నారట.
ఇక సోషల్ మీడియా వేదికగా సమంతకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు, అయితే, తాజాగా సోషల్ మీడియాలో సమంత డ్రస్సింగ్ స్టైల్‌పై రచ్చ జరుగుతోంది. చైతూతో విడాకుల తర్వాత సమంత అభిమానుల్లో చీలిలక ఏర్పడింది. అక్కినేని అభిమానులు, సమంత అభిమానులుగా విడిపోయారు.
వీరిద్దరి మధ్యా జరుగుతోన్న రచ్చ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. అసలింతకీ విషయమేంటంటే, ఈ మధ్య సమంత హాట్ హాట్ ఫోటో షూట్లపై ఓవర్ డోస్ స్కిన్ షో చేసేస్తోంది. ఆ విషయమై అక్కినేని అభిమానులు కాస్త గుస్సా అవుతున్నారట సమంతపై. ఆ వల్గారిటీ ఏంటీ.? అంతలా బరితెగించేశావెందుకు.? అక్కినేని కుటుంబం గౌరవం పోగొట్టేస్తున్నావ్..! అంటూ సమంతను ఆడి పోసుకుంటున్నారట.
అయితే, సమంత ఇప్పుడు అక్కినేని కోడలు కాదు. చైకి విడాకులు ఇచ్చేశాకా, ఆమె తన కెరీర్‌పై మరింత గట్టిగా ఫోకస్ పెట్టింది. అందులోనూ బాలీవుడ్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె గ్లామర్ డోస్ కాస్త పెంచేసింది. అయినా, అదంతా కూడా ప్రొఫిషనల్లో భాగమే. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, సమంతను టార్గెట్ చేయడం ఎంతవరకూ సబబు.? అనేది సమంత మరో వర్గం అభిమానుల వాదన.
తాజా వార్తలు
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!







