‘విక్రమ్’ డైరెక్టర్‌తో చరణ్ ప్యాన్ ఇండియా మూవీ
- June 07, 2022
ఆయన పేరు లోకేష్ కనగరాజ్. వెరీ యంగ్ తమిళ్ ఫిలిం డైరెక్టర్. తమిళంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు కూడా చాలా తక్కువే. కానీ, బోలెడంత క్రేజ్ వున్న డైరెక్టర్. ఇప్పుడీ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ పేరు తెగ మార్మోగిపోతోంది. అందుకు కారణం ఆయన రీసెంట్‌గా తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమానే.
విశ్వ నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ఇటీవలే ధియేటర్లలో సందడి చేసింది ఈ సినిమా. పెద్దగా అనుభవం లేని డైరెక్టర్, మల్టీ టాలెంటెడ్ అయిన కమల్ హాసన్‌ని డీల్ చేయడమే ఓ ఎత్తు అనుకుంటే, ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి నట దిగ్గజాలు కూడా వుండడం విశేషం.
అలాంటి నట విశ్వరూపాల్ని ఈ యంగ్ డైరెక్టర్ డీల్ చేసిన విధానం జనానికి చాలా బాగా నచ్చింది. అందుకే ‘విక్రమ్’ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ అంత పెద్ద హిట్ అయ్యింది. సరే, ఇప్పుడీ యంగ్ డైరెక్టర్ ముచ్చట ఎందుకంటారా.? ఈయన త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోతో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట.
ఆయన ఎవరో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా ఓ ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోందట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతోందట. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందనీ తెలుస్తోంది.
త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వెల్లడి కానున్నాయట. ఇంకేముంది, ఇకపై తెలుగులోనూ లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ అనిపించుకోవడం ఖాయమే. కాగా, ఆయన గతంలో తెరకెక్కించిన ‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







