కళారత్న పురస్కారాలను 23 మందికి...
- April 08, 2016
వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కళారత్న-హంస, ఉగాది పురస్కారాలను అందచేసింది. స్థానిక నాక్ కళ్యాణ మండపంలో శుక్రవారం కన్నుల పండువగా జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పురస్కారాలను అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అత్యంత ప్రతిష్ఠాకరమైన కళారత్న పురస్కారాలను ప్రవేశపెట్టింది. మొట్ట మొదటి పురస్కారాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంద చేశారు. ఈ పురస్కారాలను అందుకున్న ప్రముఖుల్లో సినీ తారలు కాంచన, మిశ్రో ఉన్నారు. కళారత్న పురస్కారాలను 23 మందికి, ఉగాది పురస్కారాలను 53 మందికి అందచేశారు. వీరిలో చాగంటి కోటేశ్వరరావు, కె రామలక్ష్మి, కలవకొలను సదానంద, డివీ మోహనకృష్ణ, కె శివప్రసాద్, ఎస్కే మిశ్రో, బండారు సుశీల, పసుమర్తి రామలింగ శాస్ర్తీ, సప్పా దుర్గా ప్రసాద్, దేవు శంకర్, గోలి శివరాం, చందు భాస్కరరావు, షేక్ బాబూజీ , తోట సిల్వెస్టర్, దాలవాయి చలపతిరావు, ఎస్ పుల్లయ్య, టి శ్రీనివాసరెడ్డి, తల్లావఝల పతంజలి శాస్ర్తీ, డాక్టర్ సిఎల్ వెంకట్రావు, డాక్టర్ రవి శారద, సి నరసింహారావు, పి చంద్రశేఖర్ ఆజాద్, కాంచన ఉన్నారు. అలాగే అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కంతేటి శివరామ్‌కుమార్, డాక్టర్ వినోదిని, అట్టాడ అప్పలనాయుడు, డివీ ధర్మారావు, చిలుకూరి దేవపుత్ర, ఏలూరి ఎంగన్న, బాలగొండ ఆంజనేయులు, అజ్మీర్ వీరభద్రయ్య, వైహెచ్‌కె మోహనరావు, మల్లవరపు రాజేశ్వరరావు, గుమ్మా సాంబశివరావు, కె ప్రతాప్‌కుమార్, సయ్యద్ నజీర్ అహ్మద్, ద్వారం సత్యనారాయణ, కొడాలి వెంకటేశ్వరరావు, భూసురపల్లి వెంకటేశ్వరరావు, వడ్లమాని సూర్యప్రకాశరావు, పత్తి ఓబులయ్య, నల్లమిల్లి మూలారెడ్డి, డోర్నాల హరిబాబు, బి జయప్రకాశ్, జెవైఎస్ అంబిక, అచ్యుత మానస, వేదాంతం రాఘవయ్య, ప్రసన్న డి ఆనంద్, బివీఎస్ సౌమ్య, పి శివప్రసాద్, గొడ్డేటి నిర్మల తేజశ్రీ, డాక్టర్ సాల్మన్‌రాజు, గిరిధర్ గౌడ్, ఎం సత్యనారాయణశెట్టి, బి ఆంజనేయులు, పి అరుణప్రసాద్, కామధేను ప్రసాద్, డాక్టర్ వెంకయ్య, జీవిఎస్ రావు, బానూజా, చక్రవధానుల రెడ్డప్ప దవేజు, కరిముళ్ల వరప్రసాద్, దుగ్గనపూడి రామ్మోహనరావు, పోతూరి రంగారావు, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, గారపాటి రామకృష్ణ, వాసిరెడ్డి నారాయణరావు, నెక్కంటి సుబ్బారావు, గంట్ల శ్రీను బాబు, విజయ్‌కుమార్ ఎమెస్కో, పావులూరి శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, జెఎస్‌ఆర్‌కె శర్మ, వడ్లమూడి ఉమా చౌదరి ఉన్నారు.
కళారత్న పురస్కారం కింద 50 వేల రూపాయల నగదు, హంస ప్రతిమతోపాటు, సర్ట్ఫికెట్‌ను ఇచ్చి, సత్కరించారు. అలాగే ఉగాది పురస్కారాల కింద 10 వేల రూపాయల నగదు, తెలుగు తల్లి ప్రతిమ, సర్ట్ఫికెట్ ఇచ్చి శాలువతో సత్కరించారు.
తాజా వార్తలు
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!









