నేషనల్ మ్యూజియంను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి

- June 08, 2022 , by Maagulf
నేషనల్ మ్యూజియంను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి

ఖతార్‌: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ లోని నేషనల్ మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట ఖతార్ మ్యూజియంల చైర్‌పర్సన్  షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ అల్-థానీ ఉన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించిన మ్యూజియం సేకరణలను ప్రదర్శించారు. భారతీయ కమ్యూనిటీ మన దేశానికి చాలా ముఖ్యమైనదని, భారత్ లోని ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు భారతీయ సమాజ అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించదని షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ అల్-థానీ అంతకుముందు చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com