కువైట్ లో వాహన భద్రతపై ముమ్మరంగా తనిఖీలు
- June 08, 2022
కువైట్: వాహన భద్రతపై కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ సాంకేతిక తనిఖీ విభాగం ముమ్మరంగా తనిఖీలు చేపడుతోంది. ఖైతాన్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు పాటించిన అనేక మంది అరెస్ట్ చేసింది. ఇందులో ఎక్కువ మంది డ్రైవింగ్ లైసెన్స్ గడువు, ముగిసిన వాహన అనుమతితో వాహనాలు నడుపుతున్న వారు ఉన్నారు. వాహనాలకు భద్రత, మన్నిక లేకపోవడంపై కూడా అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి. టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ మిషాల్ అల్-సువైజీ మాట్లాడుతూ.. పౌరులు, నివాసితులకు ట్రాఫిక్ అవగాహన పెంచడం, వారి భద్రతను నిర్ధారించడం, ముఖ్యంగా వేసవి కాలంలో అరిగిపోయిన టైర్లు లేదా వాహనం కండిషన్ కారణంగా తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన వివరించారు. వీటిని అరికట్టేందుకే విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







