పనిమనిషి రిక్రూట్‌మెంట్ ఖర్చులపై బహ్రెయిన్‌ల అసంతృప్తి
- June 08, 2022
బహ్రెయిన్: పనిమనిషి రిక్రూట్‌మెంట్ ఖర్చులు పెరగడంపై చాలా మంది బహ్రెయిన్ పౌరులు అసంతృప్తిగా ఉన్నారు. హౌస్‌మెయిడ్‌ల రిక్రూట్ మెంట్ ఏజెంట్లకు చెల్లించే ఛార్జీలు BD3,000కి పెరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రైపాక్షిక ఒప్పందానికి లేదా గృహిణుల భద్రత, ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే ఎలాంటి చట్టపరమైన చర్యలకు తాము వ్యతిరేకం కాదని, అయితే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పెరుగుతున్న ఖర్చులను అధికారులు అదుపు చేయాలని బహ్రెయిన్ వాసులు కోరుతున్నారు. సాధారణంగా ఏజెన్సీ నుండి పనిమనిషిని నియమించుకునేందుకు అయ్యే ఖర్చులో ఏజెంట్ రుసుము, పనిమనిషిని బహ్రెయిన్‌కు తీసుకురావడానికి అయ్యే ఖర్చు, వర్క్ పర్మిట్ ఖర్చు ఉంటాయి. మార్కెట్‌లో గృహ కార్మికులు, హౌస్‌మెయిడ్‌ల లభ్యత తక్కువగా ఉండటాన్ని ఏజెంట్లు క్యాష్ చేసుకుంటున్నారని పౌరులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







