రోలెక్స్ తంబికి ‘విక్రమ్’ కాస్ట్‌లీ గిప్ట్.!

- June 08, 2022 , by Maagulf
రోలెక్స్ తంబికి ‘విక్రమ్’ కాస్ట్‌లీ గిప్ట్.!

కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా ఇటీవల రిలీజై మంచి విజయం అందుకుంది. తమిళ్, తెలుగు, తదితర భాషల్లో రిలీజైన ఈ సినిమాకి విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం అందుకుంది. సినిమా సక్సెస్ అవ్వడంతో, చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

కమల్ హాసన్ కెరీర్‌లో చాలా చాలా సూపర్ హిట్లు చూశారు. కానీ, లాంగ్ గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ సినిమాతో ఆ స్థాయి హిట్  అందుకోవడంతో కమల్ ఆనందానికి అవదుల్లేవు. ఆ సంతోషంలో చిత్ర యూనిట్ వాళ్లకి రకరకాల గిఫ్ట్స్ ఇస్తున్నారు కమల్ హాసన్.

మొన్న డైరెక్టర్ కనగరాజ్‌కి ఓ కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు కమల్ హాసన్. ఇప్పుడు హీరో సూర్యకు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో సూర్య గెస్ట్ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర పేరు ‘రోలెక్స్’. అందుకే, ఆయనకు రోలెక్స్ వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు కమల్ హాసన్. అత్యంత కాస్ట్‌లీ గిప్ట్ ఇది. దాని ధర అక్షరాలా 47 లక్షలు.

ఇంకా మిగిలిన పాత్రధారులకు కమల్ హాసన్ ఎలాంటి ఖరీదైన బహుమతులు ఇవ్వనున్నారో అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మలయాల నటుడు ఫహద్ ఫాజిల్, తమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

 ఇదిలా వుంటే, టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కీ ఇలా కాస్ట్‌లీ గిఫ్టులిచ్చే అలవాటుంది. ఆయన సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు, ఏ ఒక్క టెక్నీషియన్‌నీ వదలకుండా అందరికీ గిఫ్టులిచ్చుకుంటూ పోతారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com