మాస్క్ పెట్టుకోకుంటే విమానం నుంచి దించేయండి: DGCA
- June 08, 2022
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
అంతేకాకుండా మాస్క్ ధరించని వారిని ప్రయాణానికి అనుమతించకూడదని పేర్కొంది. విమానాలు, ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు డీజీసీఏను కోరిన నేపథ్యంలో తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం కూడా డీజీసీఏ అప్రమత్తతకు కారణమైంది.ఎవరైనా ప్రయాణికులు కొవిడ్-19 ప్రొటోకాల్ పదేపదే ఉల్లంఘిస్తే వారిని ప్రత్యేకంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ఆధారంగా ఆయా ఎయిర్‌పోర్టు నిర్వాహకులు ప్రయాణీకులకు జరిమానా విధించాలని, అవసరమైతే సెక్యూరిటీ ఏజేన్సీలకు అప్పగించాలని సూచించింది.అయితే ప్రత్యేక పరిస్థితుల మధ్య మాస్క్ తీసివేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







