నిర్మాణ కార్మికులకు 3 నెలలపాటు మధ్యాహ్న విరామం
- June 09, 2022
యూఏఈ: జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ప్రాజెక్ట్, నిర్మాణ ప్రదేశాలలో కార్మికులకు మధ్యాహ్న విరామ నిబంధనను ప్రారంభిస్తున్నట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ఈ విరామ నిబంధన ప్రకారం.. ఎండలు తీవ్రంగా ఉండే మధ్యాహ్నం 12:30-3 గంటల వరకు కార్మికులను పనిచేసేందుకు అనుమతించరు. దీంతో కార్మికులు వేసవి నెలల్లో అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల కలిగే ప్రమాదాల నుండి వారిని రక్షించబడతారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. MoHREలో ఇన్‌స్పెక్షన్ అఫైర్స్ కు తాత్కాలిక అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అయిన మొహ్సేన్ అల్ నాస్సీ మాట్లాడుతూ.. గత 18 ఏండ్లుగా ఈ నియమాన్ని అమలు చేస్తున్నామని, దీంతో కార్మికులు హీట్ స్ట్రోక్‌కు గురయ్యే కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. మధ్యాహ్న విరామాన్ని ఉల్లంఘించే సంస్థలపై ఒక్కో కార్మికునికి Dh5,000 అడ్మినిస్ట్రేటివ్ జరిమానా(గరిష్టంగా Dh50,000) విధించబడుతుందని హెచ్చరించారు. నిబంధనలు పాటించని సంస్థలపై మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ కి 600590000 ద్వారా సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు అనేక భాషల్లో తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి