మహిళల సెలూన్లు, ఇన్‌స్టిట్యూట్‌లకు నోటీసులు

- June 10, 2022 , by Maagulf
మహిళల సెలూన్లు, ఇన్‌స్టిట్యూట్‌లకు నోటీసులు

కువైట్: ఫర్వానియా గవర్నరేట్‌లోని అల్-రఖీ ప్రాంతంలోని మహిళల ఆరోగ్య సెలూన్‌లు, ఇన్‌స్టిట్యూట్‌లలో మునిసిపల్ సర్వీసెస్ మహిళా పర్యవేక్షక బృందాలు తనిఖీలు నిర్వహించాయని కువైట్ మునిసిపాలిటీ తెలిపింది. మున్సిపల్ సేవల ఆడిట్ డైరెక్టర్ డాక్టర్ నాసర్ అల్-రషీది మాట్లాడుతూ..  అన్ని ఆరోగ్య అవసరాలకు సెలూన్‌లు, హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌ల నిబద్ధతను నిర్ధారించడానికి పర్యవేక్షక బృందం తనిఖీలు చేపట్టిందన్నారు. అల్-రఖీ ప్రాంతంలో నిబంధనలు పాటించని 10 మహిళల ఆరోగ్య సెలూన్లు, ఇన్‌స్టిట్యూట్‌లకు నోటీసులు, మరో 9 సంస్థలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అల్-రషీది హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com