టెస్ట్ డ్రైవ్.. 3 రోజుల్లో Dhs 15,000 ట్రాఫిక్ జరిమానాలు
- June 10, 2022
అబుదాబి: కారును కొనుగోలు చేయడానికి ముందు టెస్ట్ డ్రైవ్ కు తీసుకెళ్లిన వ్యక్తి.. మూడు రోజుల్లో Dhs 15,000 విలువైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు.దీంతో కారు యజమాని ఆ మొత్తంతోపాటు ఫీజులు, ఖర్చులు కలిపి Dhs15,170 చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. కోర్టులో కేసు వేశాడు. అన్ని వివరాలను పరిశీలించిన అబుదాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. అప్పీలుదారు ట్రాఫిక్ జరిమానాలు చెల్లించినట్లు కేసు కాగితాలలో ఆధారాలు లేవని కోర్టు సూచించింది. ట్రాఫిక్ నియంత్రణ నియమాలు, విధానాలకు సంబంధించి 2017లోని అంతర్గత మంత్రిత్వ శాఖ రిజల్యూషన్ నెం. 178లోని ఆర్టికల్ 10 ప్రకారం.. వాహన యజమాని తన వాహనాన్ని మరొకరికి అధికారికంగా బదిలీ చేయబడే వరకు వాహనంపై నమోదయ్యే అన్ని ఉల్లంఘనలను వాహనం యజమానే బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!