పవన్ కళ్యాణ్ సినిమాలో సల్మాన్ ఖాన్: క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
- June 10, 2022
మెగా కాంపౌండ్‌తో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి అత్యంత సాన్నిహిత్యం వున్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు హైద్రాబాద్ వచ్చినా చిరంజీవిని కలవకుండా వెళ్లడు. అదే చనువుతో చిరంజీవి అడిగాడని, ఆయన సినిమా ‘గాడ్ ఫాదర్’లో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించేందుకు ఒప్పుకున్నాడు సల్మాన్ ఖాన్.
అదే, ‘గాడ్ ఫాదర్’ మూవీ. మలయాళ రీమేక్ ‘లూసిఫర్’ కి తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కొన్ని నిముషాల పాటు మాత్రమే కనిపించే ఆ పాత్ర సినిమాకి ఎంతో కీలకం. కాగా, మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకుడు అన్న సంగతి తెలిసిందే.
తాజా విషయమేంటంటే, సల్మాన్ ఖాన్ ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడనేది ఆ ప్రచారం సారాంశం.
తన సినిమాలకు సంబంధించిన గాసిప్స్ విషయంలో హరీష్ శంకర్ చాలా అలర్ట్‌గా వుంటాడు. వెంటనే స్పందించి గాలి వార్తలైతే, ఆ గాసిప్స్‌కి చెక్ పెట్టేస్తుంటాడు. నిజమైతే, క్లారిటీ ఇచ్చేస్తాడు. అలాగే, ఈ సారి కూడా తన సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడం లేదంటూ, ఈ గాసిప్‌కి చెక్ పెట్టేశాడు హరీష్ శంకర్.
త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమాని మైత్రీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హరీష్ శంకర్‌కి లక్కీ ఛామ్ అయిన పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..