27ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ రిటైర్మెంట్..

- June 13, 2022 , by Maagulf
27ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ రిటైర్మెంట్..

వాషింగ్టన్ ఆధారిత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జూన్ 15న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ రిటైర్మెంట్ కాబోతోంది. IE వెబ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టిన 27ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. రెడ్‌మండ్, క్రోమియం-ఆధారిత ఎడ్జ్‌ని విండోస్ పీసీల కోసం ప్రాథమిక బ్రౌజర్‌గా తీసుకొస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత-జెన్ ఎడ్జ్ (Microsoft Edge) బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కన్నా వేగవంతమైన, సురక్షితమైన మోడ్రాన్ బ్రౌజింగ్ ఎక్స్ పీరియన్స్‌గా కంపెనీ పేర్కొంది. డెవలపర్‌లకు సంబంధించి ఈ బ్రౌజర్ వివరాలపై క్లారిటీ లేదు. జూన్ 15 తర్వాత డెస్క్‌టాప్‌లపై IE యాప్‌ను యాక్సస్ చేసుకోలేరని తెలిపింది.

Internet Explorer 11 డెస్క్‌టాప్ అప్లికేషన్ రిటైర్ కానున్నట్టు Microsoft ప్రకటించింది. Windows 10 వెర్షన్‌ యూజర్లు.. జూన్ 15, 2022 నుంచి IEలో వెబ్ బ్రౌజింగ్ యాక్సస్ చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ని సిఫార్సు చేస్తుంది. IE డెస్క్‌టాప్ అప్లికేషన్.. రాబోయే నెలల్లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌కి క్రమంగా మారనుందని స్పెషల్ FAQ పేజీలో ఉంది. అధికారిక రిటైర్మెంట్ డేట్ IE నుంచి ఎడ్జ్‌కి ఆటోమేటిక్ రిడైరెక్ట్ కానుందని తెలిపింది. రాబోయే రోజుల్లో Windows 10 నెలవారీ అప్ డేట్స్ ద్వారా IE11 డెస్క్‌టాప్ అప్లికేషన్ నిలిచిపోనుందని Microsoft తెలిపింది. FAQ పేజీ IE 11 బ్రౌజర్ లేటెస్ట్ Windows 11తో అందుబాటులో లేదని పేర్కొంది.

మార్కెట్‌లోని “Windows 10 LTSC లేదా సర్వర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 డెస్క్‌టాప్ అప్లికేషన్‌లపై దీని ప్రభావం ఉండదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. MSHTML (ట్రైడెంట్) ఇంజిన్‌ను కూడా ఈ బ్రౌజర్ ప్రభావితం చేయదు. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే Microsoft 365 ఇతర యాప్‌లను తొలగించడం ప్రారంభించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు సపోర్టు చేస్తుంది.

ఎక్స్‌ప్లోరర్‌కు సపోర్టును ఎందుకు నిలిపివేస్తోంది?
డెస్క్‌టాప్, యాప్ వెబ్ బ్రౌజర్ మార్కెట్‌లో రాణించాలంటే.. Google Chromeకి పోటీగా మైక్రోసాఫ్ట్ Chromium-ఆధారిత బ్రౌజర్ ఎడ్జ్‌ను ముందుకు తీసుకొస్తోంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ టచ్-సపోర్టింగ్ PCలు, వర్క్‌స్టేషన్ల కోసం ఇంటర్‌ఫేస్‌ను అందిస్తోంది. IE డిఫాల్ట్ బ్రౌజర్‌ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఎడ్జ్‌కి మార్చేస్తుంది. IE ఐకాన్ స్టార్ట్ మెనూలో టాస్క్‌బార్ డెస్క్‌టాప్‌లో ఉంటుందని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. IE ఐకాన్ క్లిక్ చేస్తే.. Microsoft Edgeకి రిడైరెక్ట్ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com