సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా.?
- June 17, 2022
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. చాలా సినిమాలు చేశారు. కానీ, ఒక్కటీ హిట్ టాక్ తెచ్చుకోలేదు. ప్రీ రిలీజ్ బజ్ మాత్రమే హడావిడిగా జరుగుతోంది. కానీ, ఈ సారి అలా కాదు, ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో వున్నారట సూపర్ స్టార్.
‘బీస్ట్’ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, రజనీకాంత్‌కి వినిపించిన స్టోరీ బాగా నచ్చేసిందట. వెంటనే సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేస్తూ, ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో రక్తంతో తడిసిన కత్తి వేలాడుతూ కనిపిస్తోంది. సినిమాకి ‘జైలర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్‌ని బట్టి సినిమా కథ, కథనం ఖైదీల నేపథ్యంలో సాగుతుందని అర్ధమవుతోంది. అంతేకాదు, భారీ యాక్షన్ సీన్లు కూడా వుండబోతున్నాయట సినిమాలో.
ఈ సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్యా రాయ్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ కలిసి ‘రోబో’ సినిమాలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంటుతోనే ఐశ్వర్య రాయ్ పేరు ఈ సినిమా కోసం తెరపైకి వచ్చింది.
అలాగే, యంగ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాని పట్టాలెక్కించునున్నారట. అన్నట్లు సూపర్ స్టార్‌కి ఇది 169 వ సినిమా కావడం విశేషం.
--
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







