చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచురణ.. Dh2 మిలియన్ల జరిమానా
- June 18, 2022
యూఏఈ: చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా తప్పుడు డేటాను ప్రచురించిన వారికి జైలు శిక్ష, 2 మిలియన్ దిర్హామ్‌ల వరకు జరిమానా విధించబడుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. పుకార్లు, సైబర్‌క్రైమ్‌లను ఎదుర్కోవడంపై ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ 55 ప్రకారం శిక్ష విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రచురించిన అవగాహన వీడియోలో పేర్కొంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచురించడం చేస్తే Dh2,000,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అథారిటీ పేర్కొంది. అభ్యంతరకరమైన కంటెంట్‌ని కలిగి ఉన్న ఆన్‌లైన్ ఖాతా లేదా వెబ్‌సైట్ ఆపరేషన్‌ను నిర్వహించే లేదా పర్యవేక్షించే ఏ వ్యక్తికైనా అదే పెనాల్టీ వర్తిస్తుందని వీడియోలో అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







