సరికొత్త అవతారమెత్తబోతున్న ‘డీజే టిల్లు’
- June 18, 2022
అంతవరకూ చిన్నా చితకా సినిమాలతోనే సరిపెట్టుకున్న యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘డీజె టిల్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అనూహ్యంగా ఈ సినిమాతో స్టార్ అయిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సిద్దు స్టామినాకి మించి కలెక్షన్లు కురిపించింది.
దాంతో మనోడి కాన్ఫిడెన్స్ లెవల్స్ బాగా పెరిగిపోయాయ్. బాక్సాఫీస్‌కి కాసుల పంట ఓ ఎత్తయితే, ఈ సినిమా యూత్‌లో క్రియేట్ చేసిన ట్రెండింగ్ అంతా ఇంతా కాదు. నిజంగానే టిల్లు క్యారెక్టర్‌లో సిద్దు అదరగొట్టేశాడు. ఆయన నటనను క్రిటిక్స్ సైతం మెచ్చుకోకుండా వుండలేకపోయారు.
ఆ రేంజ్‌లో ట్రెండింగ్ అయిన ‘డీజె టిల్లు’కి సీక్వెల్ రూపొందించే పనిలో ప్రస్తుతం సిద్దు జొన్నల గడ్డ బిజీగా వున్నాడు. ‘డీజె టిల్లు’ క్లైమాక్స్ సీన్‌ని సీక్వెల్ ప్లానింగ్ కోసమే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా వదిలి పెట్టిన సంగతి సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ తెలుస్తుంది.
హీరోయిన్ మోసం చేయడంతో, ఆమెకి హ్యాండిచ్చేసి, విదేశాల్లో అందమైన అమ్మాయిలతో హాయిగా ఎంజాయ్ చేసే డీజె టిల్లు సెకండ్ పార్ట్‌లో మళ్లీ డీజె ఉద్యోగం చేస్తాడట. ఎందుకు.? ఎలా.? అనేది సీక్వెల్ వచ్చాకే తెలుస్తుంది.
ఇకపోతే, అసలు విషయానికి వచ్చేస్తే, మన డీజె టిల్లు, ఇక్కడితో ఆగేలా లేడు. నటుడిగా తనలో దాగున్న మరో యాంగిల్ బయటికి తీయబోతున్నాడట. అదే విలనిజం. అవునండీ సీరియస్ విలనిజాన్ని ప్రదర్శించబోతున్నాడట డీజె టిల్లు అలియాస్ సిద్దు. ఇంతకీ ఏంటా సినిమా.? అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయట.కానీ, సిద్ధు విలన్‌గా నటించబోతున్నాడన్న విషయం మాత్రం నిజ్జంగా నిజమే.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







