అన్నయ్య నాకు రాజకీయ ప్రత్యర్థి: పవన్ కల్యాణ్

- April 10, 2016 , by Maagulf
అన్నయ్య నాకు రాజకీయ ప్రత్యర్థి: పవన్ కల్యాణ్

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిపై ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో చిరంజీవి ఉండరని, తాను అన్నయ్యను ఆహ్వానించనని పవన్ చెప్పారు. చిరంజీవి తనకు అన్నయ్య అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థిగానే తాను భావిస్తానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నటనపరంగా ఎప్పటికీ అన్నయ్యే ఆదర్శమని పవన్ చెప్పుకొచ్చారు. ఆయన స్థాయిలో నటించడం తనకు సాధ్యం కాదని చెప్పారు. రాజకీయాలపరంగా తన అన్నయ్యతో విభేదాలున్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని పవన్ కల్యాణ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com