ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ఎన్నారైల విజ్ఞప్తి

- June 22, 2022 , by Maagulf
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ఎన్నారైల విజ్ఞప్తి

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 120 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటి పై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఇందులో భాగంగా హాంకాంగ్  నుంచి జయ పీసపాటి (వ్యవస్థాపక అధ్యక్షురాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య) వ్యాఖ్యాతగా 19 జూన్ 2022 నాడు జరిగిన అంతర్జాల(Zoo) కార్యక్రమంలో వ్యవహరించారు.  

నంది పురస్కార గ్రహిత, గీత రచయిత, ఫిల్మ్‌ఫేర్, శీఈంఆ మరియు నంది అవార్డుల విజేత చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అమరగాయకుడు, ప్రముఖ సంగీతదర్శకులు, మరియు స్వాతంత్రసమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు కోసం 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కలిసి ఏకతాటి పై వచ్చి వారికి భారతరత్న పురస్కార కోసం కృషి చేయడం అభినందనీయం అని తెలిపారు. ఘంటసాల  గురుంచి మాట్లాడం తన అదృష్టంగా భావిస్తున్నాని చెపుతూ వారి జీవితం గురించి నాలుగు ఘట్టాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.మొదటి  గాయకుడిగా ఎన్నో అత్యద్భుత గీతాలను ఇప్పటికి ఎన్నటికీ తెలుగువాడి పాటను ప్రపంచ ఖ్యాతిని నలుచెరుగులా రెపరెపలాడించారు. ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లేని రోజుల్లో అన్ని గీతాలను అత్యద్భుతంగా పాడటం వారికి చెల్లిందని తెలియచేసారు.రెండవది సంగీత దర్శకుడిగా వందకుపైగా ఆణిముత్యాలు లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం భారతదేశ సినీ పరిశ్రమ మొత్తంలో వారికే చెల్లిందని, మూడవది దేశభక్తి ప్రభోదించే గీతాలను ఆలపించడం, కుంతి విలాపం, పుష్ప విలాపము, బంగారుమామ జానపద గేయాలు,జాషువా బాబాయ్ పాటలు మనుషుల జీవన ప్రమాణాలను ప్రభోదించే భగవత్గీతను అందించడం... నాలుగవది అతి ముఖ్యమైనది బాల్యంలో కడు పేదరికాన్ని అనుభవంచి వారాలు గడిపి సంగీతం నేర్చుకొని  సినీ పరిశ్రమలో ఎవరు అందుకొని మైలు రాళ్ళను  చేరుకోగలిగారు అని తెలియచేసారు... తెలుగు భాషకు తెలుగు జాతికి, తెలుగు పదానికి పర్యాయ పదంగా మారారని తెలియచేస్తూ... క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వ్యక్తి అని కొనియాడుతూ... ఇప్పటికైనా వారి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని, ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.

మరొక ముఖ్య అతిధి, గాయకుడు, సంగీత దర్శకుడు, ఈటీవీ మొట్టమొదటి  రియాలిటీషో విజేత, పాడుతా తీయగా గాయకుడు పార్థ నేమాని ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ భారతదేశ గర్వించదగ్గ మహోన్నత గాయకుడు ఘంటసాల అని చెబుతూ.. వారు మనల్ని విడిచి ఇన్ని సంవత్సరాలు అయినా మన మనసుల్లో చెరగని ముద్ర వేశారని అని చెపుతూ, 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరూ కలిసి ఏకతాటిపై వచ్చి వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయం, ముదావహం అని అన్నారు, ఘంటసాల గారిని మించిన భారతరత్నం ఏముంటుంది అని చెబుతూ వారు నిజంగా భారతరత్న'మే అని కొనియాడారు... తనకు బాగా పేరొచ్చిన పాడుతా తీయగా పాటను పాడి ప్రేక్షకులను అలరింప చేశారు.  

చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి ఘంటసాల అతిథిగా పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ ఇప్పటి దాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 దేశాల సేవలను కొనియాడారు. 

యు.యెస్.ఏ నుండి డా.రాఘవ రెడ్డి గోసాల, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాటా మాజీ అధ్యక్షుడు , గంగసాని రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడాలి చక్రధరరావు తాన ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2003/05, వ్యవస్థాపక అధ్యక్షుడు టెన్నిస్సీ తెలుగు సమితి 1995/97, డాక్టర్ జయసింహ సుంకు, ఛైర్మన్, NRI వాసవి, ఐర్లాండ్ నుండి రాధా కొండ్రగంటి అధ్యక్షురాలు, ఐర్లాండ్ తెలుగుఅసోసియేషన్, జపాన్ నుండి శాస్త్రి పాతూరి, వాలంటీర్, జపాన్ తెలుగు సమాఖ్య, భారతదేశం నుండి కోలపల్లి హరీష్ నాయుడు, బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొని మాట్లాడుతూ,  ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగు వారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలకి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో గురించి భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.  

ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు ఐర్లాండ్, జపాన్  స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 123 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (శిగ్నతురె ఛంపైగ్న్) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, వివారాలు మీ అందరి కోసం: 

https://www.change.org/BharatRatnaForGhantasalaGaru 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు మరియు వీక్షిస్తున్న ప్రేక్షకులకు బాల ఇందుర్తి ధన్యవాదాలు తెలియ చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com