అబుధాబి సమ్మర్ పాస్ విడుదల

- June 23, 2022 , by Maagulf
అబుధాబి సమ్మర్ పాస్ విడుదల

అబుధాబి: ఈ సంవత్సరం పర్యాటకులను ఆకర్షించేందుకు అబుధాబి ప్రారంభించిన "సమ్మర్ లైక్ యు మీన్ ఇట్" ప్రచార కార్యక్రమానికి అరేబియా పర్యాటక మార్కెట్ లో విశేష ఆదరణ లభించడంతో అందుకనుగుణంగా అబుదాబి సమ్మర్ పాస్ విడుదల చేసి పర్యాటక ప్రచారంలో ఇంకో అడుగు ముందుకు వేసింది.ఈ పాస్ కోసం http://summar pass.visitabudhabi.aeవెబ్సైట్ లోకి వెళ్ళండి. 

ఈ సమ్మర్ పాస్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం-అబుధాబి (DCT అబుధాబి) రూపొందించింది.ఈ పాస్ ద్వారా యూఏఈ లోని అన్ని రకాల ప్రదేశాలను చూడటమే కాకుండా పర్యాటక రంగం ఇచ్చే అతిథ్యాన్ని,యాత్ర ద్వారా పొందే అగ్ర దృశ్యాలను మరియు అనుభవాలను కేవలం విదేశీ పర్యాటకులు మాత్రమే కాకుండా మనము పొందవచ్చు. ఒక్కొక్కరికి పాస్ ఖరీదు ఈ విధంగా ఉన్నాయి పెద్దలకు AED599 కాగా 4 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు AED 499.  ఇది 31ఆగస్ట్ 2022 వరకు మాత్రమే పాస్ చెల్లుబాటు అవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com