తెలంగాణ కరోనా అప్డేట్
- June 23, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా మూడో రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం 434 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 500లకు చేరువ కావడం టెన్షన్ పెట్టిస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28వేల 865 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 494 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 315 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 102, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 97వేల 632 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 90వేల 473 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే (2,680) 3,048కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 27వేల 754 కరోనా టెస్టులు చేయగా.. 434 మందికి పాజిటివ్ గా తేలింది.
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని.. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







