అదానీ 60వ పుట్టిన రోజు..భారీ విరాళం
- June 23, 2022
ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.అదానీ, అతడి కుటుంబం కలిసి రూ.60 వేల కోట్లు సమాజ సేవకు వెచ్చించనున్నట్లు ప్రకటించారు.ఈ భారీ విరాళాన్ని అదానీ ఫౌండేషన్ నిర్వహిస్తుందని ఆయన గురువారం మీడియాకు వెల్లడించారు.
విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. తన తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి సందర్భంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్ అదానీ చెప్పారు. ‘‘శుక్రవారం నా పుట్టిన రోజు సందర్భంగా నేను, నా కుటుంబం కలిసి రూ.60 వేల కోట్లు సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నాం. భారత దేశ కార్పొరేట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విరాళం. విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తాం. ఈ నిధుల కేటాయింపు, వ్యయం వంటి అంశాలకు తుదిరూపు ఇవ్వడానికి నిపుణులతో కూడిన మూడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీల్లో నా కుటుంబ సభ్యులు కూడా ఉంటారు’’ అని అదానీ వెల్లడించారు.
వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల విక్రయ సంస్థగా 1988లో అదానీ గ్రూపు ప్రారంభమైంది. చిన్న వ్యాపార సంస్థగా మొదలై, ఇప్పుడు అంతర్జాతీయ సంస్థగా ఎదిగింది.తాజా విరాళం ప్రకటనతో అదానీ.. మార్క్ జుకర్ బర్గ్, వారెన్ బఫెట్ వంటి భారీ విరాళాలు ప్రకటించిన వారి సరసన చేరారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజా అంచనా ప్రకారం అదానీ సంపద విలువ 92 బిలియన్ డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!