పెళ్లి పీటలెక్కబోతున్న రామ్ పోతినేని.? పిల్ల ఎవరో తెలుసా.?
- June 27, 2022
యంగ్ హీరో రామ్ పోతినేనిని టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనలేం కానీ, ఆయన వయసున్న యంగ్ హీరోలు కొంతమంది ఎప్పుడో పెళ్లిళ్లు చేసుకుని, ఓ ఇంటి వాళ్లయిపోయారు. ఇంతవరకూ రామ్ పెళ్లి ముచ్చట ఎక్కడా వినిపించలేదు. రామ్‌కి సంబంధించి లవ్ ముచ్చట్లు కూడా పెద్దగా విన్నది లేదు.
ఎట్టకేలకు రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే పెళ్లి ముహూర్తం ఖరారు కానుందట. ఆగస్టులో ఎంగేజ్‌మెంజ్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు రామ్ పోతినేని కుటుంబ సభ్యులు.
ఇంతకీ రామ్ పెళ్లి చేసుకోబోయే ఆ హీరోయిన్ ఎవరంట.? రామ్‌కి మాత్రమే హీరోయిన్. ఆమెకి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు. కానీ, ఆ అమ్మాయి చిన్నప్పటి తన క్లాస్‌మేట్ అని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆ అమ్మాయితో లవ్‌లో వున్నాడట రామ్ పోతినేని.
ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో, పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. అలా రామ్ పోతినేని త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడన్నమాట. నవంబర్‌లో పెళ్లి ముహూర్తం వుంటుందని అంచనా.
కాగా, ప్రస్తుతం రామ్ పోతినేని ‘ది వారియర్’ సినిమాతో బిజీగా వున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి ఈ సినిమాలో రామ్‌కి జోడీగా నటిస్తుండగా, తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..